Chiranjeevi: చిరు సినిమాకు.. పరిశీలనలో ఈ టైటిల్‌..! - telugu news gossips on chiranjeevi new movie
close
Updated : 04/08/2021 12:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Chiranjeevi: చిరు సినిమాకు.. పరిశీలనలో ఈ టైటిల్‌..!

హైదరాబాద్‌: చిరంజీవి ‘లూసీఫర్‌’ రీమేక్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈనెల 13 నుంచి హైదరాబాద్‌లో  చిత్రీకరణ మొదలు కానుంది. ఇందుకోసం భాగ్యనగరంలో ఓ ప్రత్యేక సెట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఆ సెట్‌లోనే తొలి షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. విభిన్నమైన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమా కోసం ‘గాడ్‌ ఫాదర్‌’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం. దాదాపుగా ఇదే పేరు ఖరారయ్యే అవకాశముందని చిత్ర సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి నటిస్తున్న 153వ చిత్రమిది. దీనికి తమన్‌ స్వరాలందిస్తున్నారు. మోహన్‌ రాజ దర్శకుడు. రామ్‌ చరణ్‌తో కలిసి ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని