జయలలిత బయోపిక్‌: ‘తలైవి’ ట్రైలర్‌ చూశారా? - thalaivi trailer
close
Updated : 23/03/2021 12:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జయలలిత బయోపిక్‌: ‘తలైవి’ ట్రైలర్‌ చూశారా?

చెన్నై: ఒక వైపు జాతీయస్థాయిలో ఉత్తమనటి అవార్డు , మరోవైపు పవర్‌ఫుల్‌ ‘తలైవి’ ట్రైలర్‌ విడుదల వెరసి పుట్టినరోజున కంగనారనౌత్‌ సంబరాలు చేసుకుంటున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, సినీనటి జయలలిత బయోపిక్‌ ‘తలైవి’లో కంగనా ప్రధానపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన ట్రైలర్‌ అంచనాలను రెట్టింపు చేస్తోంది. ‘అమ్మ’ పాత్రలో కంగనా ఒదిగిపోయింది. డైలాగులు తూటాల్లా పేలుతున్నాయి. రాజకీయాల్లోకి రమ్మంటూ ఎంజీఆర్‌ పాత్రధారి అరవిందస్వామి ఆహ్వానిస్తూ చెబుతున్న డైలాగ్‌ కథను మలుపుతిప్పే ఘట్టంగా తెలుస్తోంది.

‘మహా భారతంలో కూడా ద్రౌపదికి ఇదే జరిగింది. తన చీరను లాగి అవమానపరిచిన కౌరవుల కథ ముగించి, జడ ముడేసుకుని తన శపథాన్ని నేరవేర్చుకుంది. ఆ మహాభారతానికి ఇంకో పేరుంది..జయ’ అంటూ కంగనా చెబుతున్న డైలాగ్‌ సినిమా ఏ రేంజ్‌లో ఉండనుందో చెప్పకనే చెబుతోంది. ముఖ్యంగా కేఎల్‌ విజయ్‌ టేకింగ్‌.. జి.వి ప్రకాష్ ఇచ్చిన నేపథ్య సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది.  ఈ చిత్రం ఏప్రిల్‌ 23న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ప్రకాష్‌రాజ్‌, అరవిందస్వామి, జిషు సేన్‌గుప్తా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. విబ్రి పతాకంపై విష్ణువర్థన్‌ ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి లేటేందుకు ఆ ట్రైలర్‌ను మీరు చూసేయండి.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని