close

తాజావార్తలు

బాలయ్యతో అలనాటి తార లైలా..!

హైదరాబాద్‌: టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు బాలకృష్ణ, అలనాటి తార లైలా కలిసి నటించిన చిత్రం ‘పవిత్ర ప్రేమ’. 1998లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ జంట మరోసారి కలిశారు. సినిమా కోసం అనుకుంటున్నారా..? కాదండీ..! వీరు ఎయిర్‌పోర్ట్‌ వద్ద అనుకోకుండా కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలో బాలయ్య, లైలాతోపాటు నటి సోనాల్‌ చౌహాన్‌ కూడా ఉన్నారు.

ప్రస్తుతం బాలయ్య తన 105వ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. హ్యాపీ మూవీస్‌ పతాకంపై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. సోనాల్‌ చౌహాన్‌, వేదిక కథానాయికలు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్య యంగ్‌ లుక్‌లో కనిపించి అందర్నీ ఆశ్యర్యానికి గురి చేశారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.