close

తాజావార్తలు

ఒక్కరోజు మందు తాగకపోతే చచ్చిపోతాను

ఆసక్తికరంగా ‘90 ఎంఎల్‌’ ట్రైలర్‌

హైదరాబాద్‌: ‘కొందరికి మందు తాగడం సరదా. మరికొందరికి వ్యసనం. కానీ, మా దేవదాస్‌కి అది అవసరం’ అని అంటున్నారు నటుడు కార్తికేయ. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘90ఎంఎల్‌’. నేహా సోలంకి కథానాయిక. శేఖర్‌ రెడ్డి ఎర్రా దర్శకత్వం వహించారు. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ‘నీతో కలిసి చచ్చేంత ప్రేమ నాలో ఉంది. నాతో కలిసి బతకాలనే ఆలోచనే నీలో లేదు’ అని నేహా చెప్పే డైలాగ్‌తో ఈ ట్రైలర్‌ ప్రారంభమవుతోంది.

ట్రైలర్‌లోని సన్నివేశాలను బట్టి చూస్తుంటే ఆరోగ్య పరిస్థితుల రీత్యా కార్తీకేయ చిన్నప్పటి నుంచి మద్యం తాగడం అవసరంగా మారుతుంది. కనుక ప్రతిరోజూ ‘90 ఎంఎల్‌’ మద్యం తాగుతుంటాడు. మద్యం తాగేవారంటే ఇష్టంలేని నేహా ఈ విషయం తెలిసి ‘ఒక్కరోజు మందు తాగకపోతే చచ్చిపోతావా’ అని ప్రశ్నించగా.. ‘అవును.. చచ్చిపోతాను’ అని కార్తికేయ చెబుతాడు. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. డిసెంబర్‌ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.