ఆరుబయట మూత్రం పోశాడని కొట్టి చంపారు

తాజా వార్తలు

Published : 17/11/2020 01:43 IST

ఆరుబయట మూత్రం పోశాడని కొట్టి చంపారు

లఖ్‌నవూ : ఓ యువకుడు ఆరుబయట మూత్రం పోశాడని అతడిని తీవ్రంగా కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు, బంధువుల కథనం మేరకు.. ఖైరీదికోలీ గ్రామంలో సుహైల్‌ అనే 23 ఏళ్ల యువకుడు తన బంధువుల ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాత్రి అతడు తను ఉండే బంధువుల ఇంటి ఎదుట మూత్ర విసర్జన చేశాడు. దీన్ని చూసిన ఆ చుట్టపక్కల ఇళ్లలో నివాసం ఉండే రామ్‌మూరత్‌, ఆత్మారామ్‌, రాంపాల్‌, మంజీత్‌ తదితర వ్యక్తులు యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సుహైల్‌తో గొడవకు దిగారు. ఈ క్రమంలో ఆ వ్యక్తులందరూ కలిసి యువకుడిని కర్రలతో విపరీతంగా కొట్టారు. ఈ దాడిలో యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.  

తీవ్రంగా గాయపడిన యువకుడిని బంధువులు స్థానికంగా ఉండే ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో చికిత్స పొందుతూ ఆ యువకుడు మరణించాడు. దీనిపై యువకుడి బంధువు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడిపై కర్రలతో దాడి చేసినట్లు అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధం ఉండి పరారీలో ఉన్న మరికొందరిని త్వరలో పట్టుకుంటామని బరైచ్‌ జిల్లా ఎస్పీ విపిన్‌ మిశ్రా తెలిపారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని