పోలీసుల అదుపులో రఘునందన్‌ బావమరిది

తాజా వార్తలు

Updated : 02/11/2020 05:14 IST

పోలీసుల అదుపులో రఘునందన్‌ బావమరిది

రూ.కోటి నగదు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
వివరాలు వెల్లడించిన సీపీ అంజనీకుమార్‌

హైదరాబాద్‌: హవాలా నగదు తరలింపు వ్యవహారంలో నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, బేగంపేట పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో దుబ్బాక భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు బావమరిది సురభి శ్రీనివాసరావు, అతడి డ్రైవర్‌ రవికుమార్‌ ఉన్నట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. హవాలా నగదు తరలింపు వ్యవహారంపై బషీర్‌బాగ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు.

‘‘దుబ్బాక ఉప ఎన్నికలో ఓటర్లకు పంచేందుకు రూ.కోటి నగదును తీసుకెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం. సురభి శ్రీనివాసరావు నగదు తీసుకెళ్తుండగా అతడితో పాటు డ్రైవర్‌ రవికుమార్‌ను పట్టుకున్నాం. భాజపా అభ్యర్థి రఘునందన్‌రావుకు శ్రీనివాసరావు బావమరిది. బేగంపేటలోని విశాఖ ఇండస్ట్రీస్‌ నుంచి నగదు తీసుకుని దుబ్బాక ఓటర్లకు పంచేందుకు తీసుకెళ్తున్నట్లు శ్రీనివాసరావు విచారణలో అంగీకరించారు. ఆ డబ్బును మాజీ ఎంపీ వివేక్‌ మేనేజర్‌ ఇచ్చినట్లు నిందితులు తెలిపారు. నగదుతో పాటు కారు, రెండు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. దీనిపై కేసు నమోదు చేసుకుని పూర్తిస్థాయి విచారణ చేపడుతున్నాం’’ అని సీపీ అంజనీకుమార్‌ వివరించారు.
 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని