close

తాజా వార్తలు

Updated : 28/11/2020 08:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆన్‌లైన్‌ గేమ్స్‌తో అప్పులపాలై ఆత్మహత్య

వనస్థలిపురం: ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతూ చేసిన అప్పులు తీర్చాలని అనుకున్న ఓ యువకుడు అప్పుల ఊబిలోకి కూరుకుపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడుతూ అప్పులపాలైన జగదీశ్‌ అనే యువకుడు అవి తీర్చలేక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్‌ వనస్థలిపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురానికి చెందిన జగదీశ్‌ (34) డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. ఆయన ఆన్‌లైన్‌ గేమ్స్‌పై డబ్బులు పెడుతుండేవాడు. గతంలో దాదాపు రూ. 12 లక్షలు నష్టపోతే జగదీశ్‌ తండ్రి ఈ అప్పులను తీర్చాడు. తాజాగా మళ్లీ ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతూ రూ. 15 లక్షలు నష్టపోయాడు. దీంతో చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు బలవన్మరణానికి పాల్పడే ముందు సెల్ఫీ వీడియో తీసి విషయాన్ని వెల్లడించాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన