గ్యాస్‌ పైపులైన్‌లో పేలుడు.. ఇద్దరి మృతి

తాజా వార్తలు

Published : 23/12/2020 02:11 IST

గ్యాస్‌ పైపులైన్‌లో పేలుడు.. ఇద్దరి మృతి

గాంధీనగర్‌: గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఓన్‌జీసీ పైపులైన్‌ పేలి రెండు ఇళ్లు కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా ఒకరు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కలోల్‌లోని గార్డెన్‌ సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున పేలుడు సంభవించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. పేలుడు శబ్దం కిలోమీటరు మేర వినిపించించడంలో ఉలిక్కపడ్డ ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల్లో ఉన్న ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనలో నలుగురు గాయపడినట్లు పేర్కొన్న అధికారులు పేలుడుకు గల కారణాలను నిపుణులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి...

దా‘రుణ’ యాప్‌ల వ్యవహారంలో ఆరుగురి అరెస్టు

కారులోనే ఐదుగురి సజీవ దహనంAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని