close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120024970 [video_srlno] => 1 [video_type] => 2 [video_link] => https://www.facebook.com/ETVAndhraPradesh/videos/866209583816114 [video_short_link] => https://www.facebook.com/ETVAndhraPradesh/videos/866209583816114 [created_by] => [created_date] => [modified_by] => 1017782 [modified_date] => 2020-02-21 17:04:42.640374 [display_status] => 1 [video_isdeleted] => ) [1] => stdClass Object ( [video_news_id] => 120024970 [video_srlno] => 2 [video_type] => 2 [video_link] => https://www.facebook.com/ETVAndhraPradesh/videos/242071863463699 [video_short_link] => https://www.facebook.com/ETVAndhraPradesh/videos/242071863463699 [created_by] => [created_date] => [modified_by] => 1017782 [modified_date] => 2020-02-21 17:04:42.695555 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

కోటప్పకొండ ఉత్సవాల్లో అపశ్రుతి

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

ఎడ్లపాడు: గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కోటప్పకొండకు ప్రభను తీసుకెళ్తున్న క్రమంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండల పరిధిలోని తిమ్మాపురం వద్ద కోటప్పకొండకు ప్రభను తీసుకెళ్తున్న ఎడ్లబండిని లారీ ఢీకొంది. పత్తిపాడు మండలం పెద్దగొట్టిపాడుకు చెందిన రైతులు ఎడ్లబండ్లపై ప్రభను కోటప్పకొండకు తీసుకెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన లారీ ఎడ్లబండిని ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. నిమ్మగడ్డ కోటేశ్వరరావు  అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన మరో రైతు శివాజీ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయారు. ఈ ప్రమాదంలో వీరితో పాటు మరో నలుగురు గాయపడ్డారు. మృతిచెందిన రైతుల బంధువులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

శుక్రవారం తెల్లవారుజామున చిలకలూరిపేట మండల పరిధిలో కోటప్పకొండకు తరలివస్తున్న విద్యుత్‌ ప్రభ ప్రమాదవశాత్తు పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. నాదెండ్ల మండలం అమీన్‌సాహెబ్‌పాలెం గ్రామస్థులు ప్రభతో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రభ ఉన్న వాహనం.. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి గుంతలో దిగిపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిలకలూరిపేట మండలం మురికిపూడికి చెందిన కార్మికుడు మృతిచెందాడు. ఇలా వరుస ప్రమాదాలు జరగడంతో ఉత్సవాలను రద్దు చేసుకుంటున్నట్లు అమీన్‌సాహెబ్‌పాలెం ప్రభ కమిటీ ప్రకటించింది.




Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.