కరోనా మిగిల్చిన విషాదం

తాజా వార్తలు

Published : 11/04/2020 00:28 IST

కరోనా మిగిల్చిన విషాదం

వైద్యం అందక చిన్నారి మృతి

మఠంపల్లి : కరోనా ఓ చిన్నారి పాలిట శాపమైంది. ప్రైవేటు, ప్రభుత్వ వైద్యులు అందుబాటులో లేక 18 నెలల బాలుడు ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. హృదయ విదారకమైన ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.  చిన్నారి తాత భూక్యా పాండూనాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బీమ్లతండాకు చెందిన అతడి కుమారుడు మల్లేశ్‌ కోదాడలోని మట్టపల్లి ఎన్‌సీఎల్‌ కర్మాగారంలో పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో మల్లేశ్‌ కుమారుడు నిఖిల్‌ (18 నెలలు)కు కడుపునొప్పి రావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడా అదే పరిస్థితి ఎదురైంది. ఇలా పలు ఆసుపత్రులు తిరుగుతూ.. రాత్రి ఒంటి గంటకు ప్రభుత్వ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)కి వెళ్లారు. 24 గంటలూ పనిచేయాల్సిన ఆసుపత్రి తలుపులు వేసి ఉన్నాయి. ఎంతసేపు నిరీక్షించినా వైద్యులు, సిబ్బంది రాలేదు. ఏ ఆసుపత్రికి వెళ్లినా కరోనా కారణంగా వైద్యులు రాలేదని సిబ్బంది చెప్పారని పాండూనాయక్‌ తెలిపారు. సకాలంలో చికిత్స అందకపోవడంతోనే తన మనవడు ప్రాణాలు కోల్పోయాడని విలపించాడు. బీమ్లతండాలో చిన్నారి అంత్యక్రియలు గురువారం నిర్వహించారు. ఈ విషయమై డీసీహెచ్‌ఎస్‌ వెంకటేశ్వర్‌ను సంప్రదించగా.. సీహెచ్‌సీలో రాత్రిపూట వైద్యులు తప్పనిసరిగా అందుబాటులో ఉంటారని, చిన్నారి కుటుంబ సభ్యులు సరిగ్గా గమనించకపోయి ఉండవచ్చని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని