close

తాజా వార్తలు

Published : 29/11/2020 06:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ధరణి’ పేరిట నకిలీ మొబైల్‌ యాప్‌

బీదర్‌ జిల్లా వాసులు ఇద్దరు అరెస్ట్‌

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ‘ధరణి’ వెబ్‌సైట్‌ పేరుతో నకిలీ మొబైల్‌ యాప్‌ సృష్టించిన ఇద్దరిని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సైబర్‌ క్రైం ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల గూగుల్‌ ప్లే స్టోర్‌లో ‘ధరణి- తెలంగాణ ల్యాండ్‌ రికార్డ్స్‌’ పేరిట ఓ నకిలీ యాప్‌ కనిపించగా.. రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్‌(టీఎస్‌టీఎస్‌) ప్రతినిధులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యాప్‌ ఐపీ అడ్రస్‌ ఆధారంగా కర్ణాటకలోని బీదర్‌ జిల్లా బసవకల్యాణ్‌కు చెందిన స్టేషనరీ వ్యాపారి ప్రేమ్‌మూలే(31), ఆయన స్నేహితుడైన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి మహేశ్‌కుమార్‌ దండోత్‌లు ఈ నకిలీ యాప్‌ను సృష్టించి ప్లే స్టోర్‌లో ఉంచినట్లు గుర్తించారు. సైబర్‌ సీఐ రమేశ్‌ ఆధ్వర్యంలో ఓ బృందం కర్ణాటక వెళ్లి నిందితులను అరెస్ట్‌ చేసి శనివారం హైదరాబాద్‌ తీసుకువచ్చింది. ‘ధరణి తెలంగాణ ల్యాండ్‌ రికార్డ్స్‌’ అనే యాప్‌ ప్రభుత్వానిది కాదని, డౌన్‌లోడ్‌ చేసుకొని మోసపోవద్దని ఏసీపీ ప్రసాద్‌ కోరారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన