ప్రాణం తీసిన కోతుల భయం

తాజా వార్తలు

Updated : 11/03/2021 06:47 IST

ప్రాణం తీసిన కోతుల భయం

భవనంపై నుంచి పడి విద్యార్థిని మృతి

కరీమాబాద్‌, న్యూస్‌టుడే: కోతులు దాడి చేస్తాయన్న భయంతో పరుగులు తీసిన ఓ విద్యార్థిని ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి మృతి చెందింది. ఈ ఘటన వరంగల్‌ నగరం మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ రవికిరణ్‌ కథనం ప్రకారం..జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కనపర్తి నాగుర్లపల్లి గ్రామానికి చెందిన గంజి శిరీష(24) ఎంసీఏ చదివింది. రెండు నెలలుగా వృత్తి నైపుణ్య శిక్షణ పొందుతోంది. భవనంపై తోటి విద్యార్థినులతో కలిసి షటిల్‌ ఆడుతుండగా కోతులు వచ్చాయి. అవి తమపై దాడిచేస్తాయన్న భయంతో వారంతా భవనంపై నుంచి కిందకు పరుగులు తీశారు. ఈ క్రమంలో శిరీష భవనం పిట్టగోడ పక్కన మరో భవనం ఉందనుకొని కిందకు దూకింది. దీంతో కింద పడిపోయి తీవ్రగాయాలతో అసువులు బాసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని