close

తాజా వార్తలు

Updated : 21/04/2021 07:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గుడ్డు కోసం వెళ్తే ప్రాణం పోయింది

గోడ కూలి విద్యార్థి దుర్మరణం


లిఖితేశ్వర్‌ (పాతచిత్రం)

పలమనేరు, న్యూస్‌టుడే: గంగవరం మండలం జీఎల్‌ఎస్‌ఫారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ర్యాంపు గోడ కూలి విద్యార్థి మృతి చెందిన ఉదంతం ఇది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... 1-9 తరగతుల విద్యార్థులకు మంగళవారం నుంచి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కోడిగుడ్లు చెడిపోతాయనే ఉద్దేశంతో పాఠశాల ప్రధానోపాధ్యాయిని సుమిత్ర గుడ్లు తీసుకెళ్లడానికి ఉదయం పిల్లల్ని పిలిపించారు. పాఠశాలకు సమీపంలో కాపురముంటున్న 5వ తరగతి విద్యార్థి లిఖితేశ్వర్‌ (11) కూడా వెళ్లాడు. స్థానిక ఎన్నికల్లో వికలాంగులు ఓట్లేయడం కోసం ర్యాంపునకు అనుబంధంగా పాఠశాల వద్ద చిన్న గోడ నిర్మించారు. లిఖితేశ్వర్‌ దాన్ని ఎక్కాడు. గోడ బలహీనంగా ఉండటంతో కూలిపోయింది. అదుపు తప్పిన బాలుడు తటాలున కింద పడటం.. అతని తలమీద గోడ పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించే లోపు మృతి చెందాడు. ప్రధానోపాధ్యాయిని ఫోన్‌ చేసి తమ పిల్లాడిని కోడిగుడ్ల కోసం పిలిపించారని, ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తమ బిడ్డ మృత్యువాతపడ్డాడని తల్లి లతశ్రీ ఆరోపించారు. ఈ మేరకు గంగవరం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని