AP News: ప్రేమ పేరుతో గొంతుకోశాడు
close

తాజా వార్తలు

Updated : 19/06/2021 11:17 IST

AP News: ప్రేమ పేరుతో గొంతుకోశాడు

కడప జిల్లాలో విద్యార్థిని దారుణ హత్య

బద్వేలు, న్యూస్‌టుడే: ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు కత్తితో విద్యార్థిని గొంతులో పొడిచి ప్రాణం తీశాడు. కడప జిల్లా బద్వేలు మండలం చింతలచెరువు గ్రామానికి చెందిన సుబ్బయ్య, సుబ్బమ్మల కుమార్తె శిరీష డిగ్రీ చదువుతోంది. అట్లూరు మండలం చిన్నరాజుపల్లెకు చెందిన నారాయణ, పద్మల కుమారుడు చరణ్‌ హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రేమిస్తున్నానని చరణ్‌.. శిరీష వెంటపడగా నిరాకరించింది. ఇటీవల ఇంటికి వచ్చిన యువకుడు నాలుగు రోజుల క్రితం వెళ్లిపోయాడు. ఈ క్రమంలో శుక్రవారం శిరీష ఇంటికి వెళ్లాడు. విద్యార్థినితో మాట్లాడే క్రమంలో ఆమె గొంతుపై కత్తితో పొడిచాడు. అక్కడే కుప్ప కూలిపోగా కుటుంబ సభ్యులు బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శిరీష తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రశేఖర్‌ తెలిపారు. దాడి చేసిన చరణ్‌ను గ్రామస్థులు పట్టుకొని కొట్టారు. పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం బద్వేలు ప్రభుత్వాసుత్రికి తరలించారు. విషద్రావణం తాగాడనే సందేహంతోనూ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని