AP News: అట్టపెట్టెలో శిశువు

తాజా వార్తలు

Updated : 12/07/2021 08:21 IST

AP News: అట్టపెట్టెలో శిశువు

గుర్తించిన కాటికాపరి

చాగల్లు, కాకినాడ జీజీహెచ్‌, న్యూస్‌టుడే :  ఎవరి బిడ్డో తెలియదు..శ్మశానంలో వదిలి వెళ్లిపోయారు.. అట్టపెట్టెలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నవజాత శిశువును కాటికాపరి గుర్తించాడు. స్థానికులు తెలిపిన ప్రకారం..తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్మశాన వాటికలో శనివారం అర్ధరాత్రి నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు అట్టపెట్టెలో ఉంచి వెళ్లిపోయారు. పసిపాప ఏడుపును గమనించిన కాటికాపరి శివ అట్టపెట్టెలో ఉన్న మగశిశువును గుర్తించి, స్థానికులైన వెంకటేష్‌ దంపతులకు అప్పగించడంతో వారు రాజమహేంద్రవరంలోని ప్రత్యేక చిన్న పిల్లల సంరక్షణ యూనిట్‌కు తీసుకెళ్లారు. శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో 108 నియోనాటల్‌ అంబులెన్సుకు సమాచారం అందించారు. సిబ్బంది శాంతకుమార్‌, పైలెట్‌ బుల్లిరాజు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని శిశువుకు అత్యవసర వైద్యాన్ని అందిస్తూ కాకినాడ ఎన్‌ఐసీయూ(నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌)కు తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, బరువు సుమారు 750 గ్రాములున్నట్లు ఐసీడీఎస్‌ పీడీ జీవీ సత్యవాణి తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని