కరోనా సోకిందంటూ వివక్ష.. వ్యక్తి ఆత్మహత్య
close

తాజా వార్తలు

Published : 22/04/2021 10:06 IST

కరోనా సోకిందంటూ వివక్ష.. వ్యక్తి ఆత్మహత్య

గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలం మర్లపాలెంలో విషాదం చోటుచేసుకుంది. కరోనా వచ్చిందనే భయంతో ఓ వృద్ధుడు చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గాసర్ల హరిబాబు (74) మూడు రోజులుగా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. దీంతో చుట్టుపక్కల ఉన్నవారితో పాటు కుటుంబసభ్యులు సైతం హరిబాబుపై వివక్ష చూపడంతో ఆయన ఒత్తిడికి గురయ్యారు. కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకోకుండానే భయంతో స్థానిక చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. 
సమాచారం అందుకున్న వెంటనే గన్నవరం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని