TS News: ప‌ట్టుబ‌డిన మావోయిస్టు మృతి

తాజా వార్తలు

Updated : 06/06/2021 14:18 IST

TS News: ప‌ట్టుబ‌డిన మావోయిస్టు మృతి

హైద‌రాబాద్‌: క‌రోనా చికిత్స కోసం వ‌చ్చి ఇటీవ‌ల వ‌రంగ‌ల్‌లో పోలీసుల‌కు ప‌ట్టుబ‌డిన‌ మావోయిస్టు గ‌డ్డం మ‌ధుక‌ర్ మృతిచెందాడు. అత‌డిని ఈ నెల 2న అదుపులోకి తీసుకున్న పోలీసులు క‌రోనా చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ ఈ తెల్ల‌వారుజామున గుండెపోటుతో మృతిచెందిన‌ట్లు మ‌ధుక‌ర్ కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందింది.
మ‌ధుక‌ర్ స్వ‌స్థ‌లం కుమురం భీం జిల్లా జెజ్జూర్‌ మండ‌లం కొత్త‌ప‌ల్లి గ్రామం. 22 ఏళ్ల క్రితం పీపుల్స్‌వార్ దళంలో ఆయన స‌భ్యుడిగా చేరారు. మొన్న పోలీసుల‌కు చిక్కే వ‌ర‌కూ దండకార‌ణ్య స్పెష‌న్ జోన్ డివిజ‌న్ క‌మిటీ కార్య‌ద‌ర్శిగా ఉన్నాడు. మావోయిస్టు మృత‌దేహాన్ని పోలీసులు అత‌డి స్వ‌స్థ‌లానికి త‌ర‌లించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని