Google Wallet: భారత్‌లోకి గూగుల్‌ వాలెట్‌ వచ్చేసింది.. ఏమేం యాడ్‌ చేయొచ్చు?

Google Wallet: టికెట్లు, పాసులు, ఐడీలను భద్రపర్చుకునేందుకు వీలుగా గూగుల్‌ డిజిటల్‌ వాలెట్‌ను భారత్‌లో విడుదల చేసింది.

Updated : 08 May 2024 16:56 IST

దిల్లీ: భారత్‌లో ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం గూగుల్‌ ప్రైవేట్‌ డిజిటల్‌ వాలెట్‌ను (Google Wallet) విడుదల చేసింది. ఇందులో లాయల్టీ కార్డులు, మూవీ టికెట్లు, పాసులు, ఐడీలను భద్రంగా స్టోర్‌ చేసుకోవచ్చు. ఇది గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి వచ్చింది. దీన్ని తీసుకురావడం వల్ల ‘గూగుల్‌ పే’పై ఎలాంటి ప్రభావం ఉండదని, దాన్ని ప్రాథమిక చెల్లింపుల యాప్‌గా కొనసాగిస్తామని గూగుల్‌ స్పష్టం చేసింది. ప్రధానంగా లావాదేవీలయేతర అవసరాల కోసమే వాలెట్‌ను రూపొందించినట్లు తెలిపింది.

ఏమేం యాడ్‌ చేయొచ్చు..?

  • ఫోన్‌లోనే మెట్రో కార్డ్‌లు, విమాన టికెట్లు, బస్ పాస్‌లు తీసుకెళ్లొచ్చు. గూగుల్‌ సెర్చ్‌ నుంచి అందిన సమాచారంతో ప్రయాణ సమయాల్లో మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. 
  • లాయల్టీ, గిఫ్ట్ కార్డ్‌లను గూగుల్‌  వాలెట్‌కు (Google Wallet) అనుసంధానిచొచ్చు. ఫలితంగా వాటి గడువు ముగిసేలోపు ప్రయోజనాన్ని పొందేలా ఎప్పటికప్పుడు గుర్తుచేస్తుంది.
  • క్రికెట్‌ మ్యాచ్‌, సినిమా లేదా ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్‌ షో టికెట్లను వాలెట్‌కు జత చేసుకోవచ్చు. తద్వారా ఆ సమయానికి వాలెట్‌ మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. ఫలితంగా ఏమాత్రం ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్‌ కాకుండా ఉంటారు.
  • Google Walletలో భద్రపరిచే ప్రతి సమాచారం సురక్షితంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. 2-స్టెప్‌ వెరిఫికేషన్‌, ఫైండ్‌ మై ఫోన్‌, రిమోట్‌ డేటా ఎరేజ్‌, కార్డు నంబర్లను బహిర్గతం చేయకుండా ఎన్‌క్రిప్టెడ్‌ పేమెంట్‌ కోడ్‌ వంటి గూగుల్‌ భద్రతా ఫీచర్లన్నీ వాలెట్‌కూ వర్తిస్తాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని