close

తాజా వార్తలు

Updated : 16/04/2021 08:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దూసుకొచ్చిన మృత్యువు

దాచేపల్లి: మృత్యువు దూసుకొచ్చింది. రహదారి పక్కన నిల్చుని మాట్లాడుతున్న ముగ్గురిని సిమెంట్‌ లారీ రూపంలో మృత్యువు కబళించింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గణపతి కోల్డ్‌ స్టోరేజి వద్ద సిమెంట్‌ లారీ, మిర్చి లారీ ఒకదానికొకటి క్రాస్‌ చేయబోయి స్వల్పంగా ఢీకొన్నాయి. ఈక్రమంలో రెండు లారీల డ్రైవర్లు వాహనాలను పక్కన ఆపి వాగ్వాదానికి దిగారు. గామాలపాడు గ్రామస్థులు వచ్చి డ్రైవర్లతో మాట్లాడుతున్న సమయంలో  వెనుక నుంచి మరో సిమెంట్‌ లారీ వేగంగా వచ్చి వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు, గామాలపాడు గ్రామానికి చెందిన సీతారామయ్య అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని