Viveka Murder Case: సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి

తాజా వార్తలు

Updated : 17/08/2021 14:51 IST

Viveka Murder Case: సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి

పులివెందుల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ 72వ రోజు కొనసాగుతోంది. పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో అనుమానితులను సీబీఐ విచారిస్తోంది. విచారణలో భాగంగా ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి కీలక అనుమానితుడిగా ఉన్నారు. మరోవైపు కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ అధికారుల మరో బృందం చేపట్టిన విచారణకు జగదీశ్వర్‌రెడ్డి, భరత్‌ కుమార్‌ హాజరయ్యారు. వీరిలో జగదీశ్వర్‌రెడ్డి వైఎస్‌ వివేకానందరెడ్డి పొలం పనులు చూసేవారు కాగా.. భరత్‌ కుమార్‌ సీబీఐ అరెస్టు చేసిన సునీల్‌ యాదవ్‌ బంధువు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని