గాయని పేరుతో నకిలీ ఖాతాలు.. వ్యక్తి అరెస్టు

తాజా వార్తలు

Updated : 17/07/2021 18:50 IST

గాయని పేరుతో నకిలీ ఖాతాలు.. వ్యక్తి అరెస్టు

హైదరాబాద్: తెలుగు సినీ గాయని పేరుతో సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని నారలూరుకు చెందిన నవీన్‌ను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఇంటర్వ్యూలో గాయనిని చూసి అభిమానిగా మారిన నవీన్.. గాయనికి తెలియకుండా ఆమె ఫొటోతో ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్, ట్విటర్‌లో నకిలీ ఖాతాలు తెరిచాడు. పలు వీడియోలు, ఆల్బమ్‌లు, పాటలు, లఘు చిత్రాలను ఆ ఖాతాల్లో పోస్ట్‌ చేశాడు. విషయం తెలుసుకున్న గాయని ఖాతాలను తొలగించాలని పలుమార్లు నవీన్‌ను కోరింది. అందుకు నిరాకరించడమే కాకుండా గాయనిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో గాయని రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా నవీన్‌ను అరెస్ట్ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని