ఇంటర్వ్యూకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకుల దుర్మరణం

తాజా వార్తలు

Updated : 06/09/2021 09:25 IST

ఇంటర్వ్యూకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకుల దుర్మరణం

చెన్నై(మహాబలిపురం), న్యూస్‌టుడే: వారంతా స్నేహితులు. ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ఉద్యోగంలో చేరి తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలనుకున్నారు. ఇంటర్వ్యూకని చెన్నై బయలుదేరగా లారీ రూపంలో మృత్యువు వారిని బలితీసుకుంది. ఈ ప్రమాదం చెన్నైలోని వండలూర్‌ సమీపంలో జరిగింది. పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.. రాహుల్‌ కార్తికేయన్‌ (పుదుక్కోట), రాజహరీష్‌ (మేట్టూర్‌), అరవింద్‌ శంకర్‌ (చెన్నై కేకే నగర్‌), అజయ్‌ (తిరుచ్చి), నవీన్‌ (మేట్టూర్‌) స్నేహితులు. అంతా 25-30 ఏళ్ల వయసు వారే. ఇంజినీరింగ్‌ చేసి ఉద్యోగాల కోసం చూస్తున్నారు. చెన్నైలో ఓ ప్రముఖ కంపెనీలో సోమవారం ఇంటర్వ్యూ ఉండటంతో అందరూ ఓ కారులో శనివారం బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చెంగల్పట్టు జిల్లా పెరుంగళత్తూర్‌ సమీపంలో ఆగి ఉన్న ఇనుప కడ్డీల లోడు లారీని ఢీకొంది. ప్రమాదంలో అయిదుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని