మత్స్యశాఖలో రూ.కోట్ల అవినీతి

ప్రధానాంశాలు

Published : 04/08/2021 05:49 IST

మత్స్యశాఖలో రూ.కోట్ల అవినీతి

 రూ. 6 కోట్లు దారి మళ్లించిన ఏడీ

దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో కోట్ల రూపాయల అవినీతి వెలుగుచూసింది. ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారి కథనం మేరకు.. జిల్లా మత్స్యశాఖలో గతంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన పద్మనాభమూర్తి ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో పనిచేశారు. ఈ ఏడాది జూన్‌ 21న కొవిడ్‌తో మృతి చెందారు. తర్వాత కొన్ని రోజులకు ఆయన అక్రమాలు బయటపడ్డాయి. రూ.2 కోట్ల మేర నిధులు దారి మళ్లించినట్లు తూర్పుగోదావరి జిల్లా అధికారులు తెలుసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పనిచేసినప్పుడు రూ.4.12 కోట్లు స్వాహాచేసినట్లు అధికారులు కనుగొన్నారు. ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి అనధికారికంగా సొమ్ములు కాజేసినట్లు గుర్తించారు. దీనిపై పశ్చిమగోదావరి జిల్లా మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ (ఇన్‌ఛార్జ్‌) నాగలింగాచార్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఏలూరు త్రీటౌను సీఐ వరప్రసాద్‌ దర్యాప్తు చేపట్టారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన