
ప్రధానాంశాలు
పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ఆత్మహత్యాయత్నం
యువతి మృతి.. యువకుడి పరిస్థితి విషమం
ఉదయగిరి, న్యూస్‌టుడే: పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని యువతి బావిలో దూకి ఆత్మహత్య చేసుకోగా.. యువకుడు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సోమవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం పుల్లాయపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. పుల్లాయపల్లికి చెందిన యువతి(18), అదే గ్రామానికి చెందిన షేక్ ఇమాంఖాసింలు ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి విషయాన్ని యువకుడు ఆదివారం యువతి కుటుంబ సభ్యులతో మాట్లాడగా వారు అంగీకరించలేదు. తర్వాత జమాత్‌కు వెళుతున్నట్లు స్థానికులకు చెప్పిన ఇమాం.. ఊరి నుంచి వెళ్లిపోయాడు. పశువులకు మేత వేసి వస్తానని చెప్పిన యువతి ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చి సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఇమాంఖాసిం కడప జిల్లా గోపవరం మండలం పి.పి కుంట వద్ద అటవీ ప్రాంతంలో మాత్రలు మింగి, బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అనంతరం గ్రామంలోని తన మిత్రులకు తెలపడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని బద్వేలులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. సోమవారం సాయంత్రానికి యువతి మృతదేహాన్ని వ్యవసాయ బావి నుంచి బయటకు తీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఉదయగిరి ఎస్సై మరిడినాయుడు తెలిపారు.
ప్రధానాంశాలు
సినిమా
- ఏంటీ ఇవన్నీ రీమేక్‌లా..!
- నాపై నాకే చిరాకేసింది: బెన్‌స్టోక్స్
- పెళ్లి కుదిరాక నిరాకరించాడని!
- అర్ధరాత్రి ఆకలేస్తోందా...
- నెలకు రూ.8వేలు రావాలంటే...
- ప్రభాస్‌తో ఫరియా.. పాయల్ తెలుగు.. శ్రీముఖి సెల్ఫీ
- మనసుకు నచ్చినవాడిని మనువాడి...
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
- క్యాస్టింగ్ కౌచ్‌ని ఎదిరించి.. సినిమాల్లో రాణించి..!
- రివ్యూ: ఏ1 ఎక్స్‌ప్రెస్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
