
ప్రధానాంశాలు
ముప్పు తప్పించే వారిపైనే కూలిన కప్పు
గని ప్రమాదంలో ఇద్దరు కార్మికుల మృతి
కోల్బెల్ట్ (భూపాలపల్లి), న్యూస్టుడే: బొగ్గుగనిలో కప్పు కూలకుండా చేసి ముప్పు తప్పించేవారినే ప్రమాదం కబళించింది. జయశంకర్ జిల్లా భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 6వ గనిలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించారు. రెండో షిఫ్టులో సపోర్టుమెన్గా పని చేసే కాతం నర్సయ్య (51), సలవేని శంకరయ్య (53) గనిలోకి దిగి పైకప్పు కూలకుండా దిమ్మెలను అమర్చే పనులు చేస్తుండగా ఒక్కసారిగా వారిపై పైకప్పు కూలింది. దాంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పక్కనే ఉన్న మరో సపోర్టుమెన్, సర్దార్, ఓవర్మెన్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
అధికారుల నిర్లక్ష్యం: గనిలో జరిగిన ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని కార్మికులు ఆరోపిస్తున్నారు. ‘పైకప్పునకు దిమ్మెలు ఏర్పాటు చేసే ముందు రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఆ తర్వాత అధికారులు దగ్గరుండి ఓవర్మెన్, సర్దార్ల పర్యవేక్షణలో కప్పును పరిశీలించాలి. బలోపేతంగా ఉంటేనే దాని కింద దిమ్మెలను అమర్చాలి. కానీ పైకప్పును గట్టిగా కొట్టి చూడకుండానే అధికారులు సపోర్టుమెన్లను పనులకు పురమాయించారు. అందువల్లే ప్రమాదం జరిగింది’ అని కార్మికులు పేర్కొన్నారు. కాగా మృతదేహాలను అంబులెన్స్ ఎక్కిస్తున్న క్రమంలో కార్మికులు అడ్డుకున్నారు. సీఐ వాసుదేవరావు వారికి నచ్చజేప్పి మృతదేహాలను ఆసుపత్రికి పంపించారు.
మరిన్ని
సినిమా
- ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత
- ఆ పాత్రలకు.. ఎవరు సరిపోతారా..!
- కొవిడ్.. కొత్తగా!
- Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
- social look: అషు ప్రార్థన.. అఖిల్ కొత్తగా..
- WhatsApp: ఈ ‘పింక్’ లింక్ మీకూ వచ్చిందా?
- విరాళంగా వచ్చిన 15వేల చెక్కులు బౌన్స్!
- నీ ఆశలన్నీ.. నా శ్వాసలోనే
- చివరిసారి సంతోషంగా ఉన్నది అప్పుడే: ధోనీ
- ఉదయాన్నే మజ్జిగ తాగండి..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
