close

ప్రధానాంశాలు

Published : 11/04/2021 06:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దగ్ధమైన ఏటీఎంలు బూడిదైన రూ.32లక్షలు

పామిడి, న్యూస్‌టుడే: ఏపీలోని అనంతపురం జిల్లా పామిడిలోని ఎస్‌బీఐ ఏటీఎం గదిలో శనివారం  మధ్యాహ్నం మంటలు చెలరేగడంతో స్థానికులు అప్రమత్తమై పక్క దుకాణాలకు విస్తరించకుండా అదుపు చేసే యత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అప్పటికే ఆ గదిలోని 2 ఏటీఎంలు, ఓ నగదుజమ యంత్రం, 2 కోడింగ్‌ యంత్రాలు, 2 ఏసీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. యంత్రాల్లోని రూ.32 లక్షలూ బూడిదైనట్లు ఎస్‌బీఐ మేనేజరు లక్ష్మీనరసింహ తెలిపారు. మొత్తం రూ.44లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన