అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ బ్యాంక్‌కు రూ.7.35 కోట్ల టోకరా

ప్రధానాంశాలు

Published : 15/09/2021 04:35 IST

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ బ్యాంక్‌కు రూ.7.35 కోట్ల టోకరా

ఇన్వెస్కో మాజీ అసిస్టెంట్‌ మేనేజర్‌ అరెస్ట్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రముఖ విదేశీ కార్పొరేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ బ్యాంక్‌ను మోసం చేసి రూ.కోట్లు స్వాహా చేసిన ఇన్వెస్కో మాజీ అసిస్టెంట్‌ మేనేజర్‌ మోహన్‌ కోటిలింగంను హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఇతడిది గుంటూరు జిల్లా చిలకలూరిపేట. ఈ బ్యాంక్‌ తన ఖాతాదారులకు క్రెడిట్‌ కార్డులు, ట్రావెలర్స్‌ చెక్కుల పంపిణీకి హైదరాబాద్‌లోని ఇన్వెస్కో సంస్థతో పదేళ్ల క్రితం ఒప్పందం కుదుర్చుకుంది. సంస్థ ఉద్యోగులందరికీ తన క్రెడిట్‌కార్డులు ఇచ్చింది. ఉద్యోగం వదిలేసినప్పుడు వెనక్కి ఇవ్వాలని పేర్కొంది. వినియోగదారులకు ఇస్తున్న క్రెడిట్‌కార్డులు, ట్రావెలర్స్‌ చెక్కుల జారీ బాధ్యతలను ఇన్వెస్కో.. సహాయ మేనేజర్‌ మోహన్‌ కోటిలింగం ఉద్దానకు అప్పగించింది. పదేళ్లపాటు మోహన్‌ నమ్మకంగా పనిచేశాడు. వేరే సంస్థలో ఉద్యోగం రావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1న రాజీనామా చేశాడు. బ్యాంక్‌ ఇచ్చిన క్రెడిట్‌కార్డును తిరిగి ఇవ్వలేదు. దానికి పరిమితి లేకపోవడంతో ఆ కార్డు ద్వారా 360 నకిలీ లావాదేవీలు చేసి రూ.7.35 కోట్లు వేర్వేరు బ్యాంకుల్లో జమచేసుకున్నాడు. వివరాలు పరిశీలించి బ్యాంక్‌ ప్రతినిధులు మోహన్‌పై 6నెలల క్రితం సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన