Kidnap: సినీ ఫక్కీలో టెకీ అపహరణ.. మిత్రులే నిందితులు

ప్రధానాంశాలు

Updated : 24/09/2021 07:49 IST

Kidnap: సినీ ఫక్కీలో టెకీ అపహరణ.. మిత్రులే నిందితులు

బెంగళూరు, న్యూస్‌టుడే: నగదు కోసం వినీత్‌ అనే టెకీని అపహరించి రూ.2 కోట్లు డిమాండు చేసిన అతని మిత్రులైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ప్రశాంత్‌, సంతోశ్‌, అరివేగన్‌లను బెంగళూరు కోరమంగల పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సంతోశ్‌, వినీత్‌ ఒకే చోట పని చేసేవారు. ఇటీవలే వినీత్‌ కొత్తగా అంకుర పరిశ్రమ ప్రారంభించి మరో సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. తనకు ఇవ్వవలసిన పాత బకాయి చెల్లించడానికి వినీత్‌ నిరాకరించడంతో తన స్నేహితులతో కలిసి అపహరణకు సంతోశ్‌ పథకాన్ని రచించాడు. పార్టీకి రమ్మని వినీత్‌ను ఆహ్వానించిన నిందితులు గత మంగళవారం కారులో చెన్నై సమీపంలోని ఓ ఇంట్లో బంధించారు. అతని కుటుంబ సభ్యులకు బుధవారం రాత్రి వాట్సప్‌ కాల్‌ చేసి నగదు డిమాండు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు, కాల్‌డేటా ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన