రక్షణ శాఖ మాజీ ఉద్యోగులకు సత్వర సేవలు
eenadu telugu news
Published : 25/09/2021 02:20 IST

రక్షణ శాఖ మాజీ ఉద్యోగులకు సత్వర సేవలు


సేవాకేంద్రం ప్రారంభిస్తున్న రక్షణ శాఖ అకౌంట్స్‌ జనరల్‌ రజనీష్‌కుమార్‌

బాపట్ల, న్యూస్‌టుడే : రక్షణ శాఖ మాజీ ఉద్యోగులు, సిబ్బందికి పింఛన్లు సత్వరమే అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆ శాఖ అకౌంట్స్‌ విభాగం జనరల్‌ రజనీష్‌కుమార్‌ తెలిపారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో ‘సిస్టం ఫర్‌ పెన్షన్‌ అడ్మినిస్ట్రేషన్‌ రక్ష’ సేవాకేంద్రాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. విశ్రాంత సైనికోద్యోగులకు పింఛను మంజూరు ప్రక్రియలో తలెత్తే సమస్యలను సేవాకేంద్రం సత్వరమే పరిష్కరిస్తుందన్నారు. సిబ్బంది బాపూజీ, డేవిడ్‌రాజు, విద్యాసాగర్‌, మాజీ సైనికుల కమిటీ అధ్యక్షుడు రెడ్డి వరప్రసాద్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని