పెరిగిన మాస్కుల వినియోగం
logo
Published : 07/05/2021 02:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెరిగిన మాస్కుల వినియోగం

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలంటూ పోలీసులు చేసిన యత్నం సత్ఫలితాలు ఇచ్చింది. ట్రాఫిక్‌, శాంతిభద్రతల విభాగం పోలీసులు నగర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టి మాస్క్‌లు లేని వారికి జరిమానాలు విధిస్తున్నారు. అక్కడితో సరిపెట్టకుండా కౌన్సెలింగ్‌ ఇస్తుండటంతో ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. గత నాలుగు రోజులుగా చాలా తక్కువ మొత్తంలో కేసులు నమోదవుతుండటం గమనార్హం. గురువారం 21 మంది మాత్రమే మాస్క్‌లు ధరించకుండా రోడ్లపై తిరుగుతూ పోలీసులకు పట్టుపడ్డారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని