టీకా కోసం వరుస కట్టారు...
Published : 16/05/2021 05:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకా కోసం వరుస కట్టారు...

విజయవాడ నగరం మధురానగర్‌లోని సద్గత విద్యానికేతన్‌లో ఏర్పాటు చేసిన శాశ్వత టీకా కేంద్రం వద్ద శనివారం కొవాగ్జిన్‌ కోసం ప్రజలు బారులు తీరారు. ఇక్కడ రెండో విడతకు 800 డోస్‌లు కేటాయించారు. వీటి కోసం 28, 29, 30, 31 డివిజన్ల ప్రజలు భారీగా తరలివచ్చారు. ఉదయం 7 గంటల నుంచే వరుసకట్టారు. కేంద్రంలో విశాలమైన స్థలం ఉన్నప్పటికీ.. ఒక్కసారిగా వందలాది మంది రావటంతో ఆవరణ మొత్తం నిండిపోయింది. నగరపాలకసంస్థ సిబ్బంది రద్దీని నియంత్రించేందుకు వరుస క్రమంలో నించోబెట్టారు. దీంతో జనం రోడ్డు మీదకు వచ్చేశారు. టోకెన్‌ నెంబర్ల ప్రకారం ఒక్కొక్కరిని పిలుస్తుండటంతో.. ఎండ వేడిమికి విలవిలలాడిపోయారు. అసహనానికి లోనయ్యారు. సరైన ఏర్పాట్లు చేయలేదంటూ నిర్వాహకులపై మండిపడ్డారు. కొందరు వరుసలో నిలబడకుండా సిఫార్సు ఉందంటూ లోనికి వెళుతుండటంతో అడ్డుకున్నారు. ఫలితంగా కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి క్యూలైన్లను సరిచేయించారు. కాగా, క్యూ లైన్లలో భౌతిక దూరం పాటించకపోవటం విమర్శలకు తావిస్తోంది. సచివాలయ సిబ్బంది, నగరపాలకసంస్థ అధికారులు మొక్కుబడిగా విధులు నిర్వస్తున్నారని ప్రజలు పేర్కొన్నారు.

- న్యూస్‌టుడే, మధురానగర్‌(విజయవాడ)


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని