డిశ్ఛార్జ్‌ అయిన వారికి నగదు బహుమతి
Published : 16/05/2021 05:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డిశ్ఛార్జ్‌ అయిన వారికి నగదు బహుమతి

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాలోని కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉన్నారని కలెక్టరు ఇంతియాజ్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా వ్యక్తులకు ఉన్న కొవిడ్‌ లక్షణాలను బట్టి, వైద్య నివేదికల ఆధారంగా చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు. మొత్తం ఏడు కేంద్రాల ద్వారా చికిత్స అందిస్తున్నట్టు వివరించారు. ఆక్సిజన్‌ కొరత లేకుండా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. వీటి ద్వారా మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నా, కరోనా బాధితులు ఆసుపత్రుల్లోనే చికిత్స పొందేందుకు ఆసక్తి చూపుతున్నట్టు విశదీకరించారు. కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో చికిత్స పొంది, కోలుకుని డిశ్ఛార్జ్‌ అయిన వారిని గుర్తించి, నగదు పురస్కారాన్ని అందజేస్తామన్నారు. ముగ్గురిని లక్కీ డీప్‌ ద్వారా ఎంపిక చేసి, ప్రతి సోమవారం ప్రకటిస్తామని పేర్కొన్నారు. విజేతలకు రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు చొప్పున నగదు పురస్కారాలు అందిస్తామని వెల్లడించారు. జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం, జగ్గయ్యపేట ప్రాంతాల్లో ఏడు కొవిడ్‌ కోర్‌ కేంద్రాలు ఉండగా, నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో మరో కేంద్రాన్ని అందుబాటులోకి తేనున్నట్టు కలెక్టరు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని