ఆన్‌లైన్‌లో విద్యా బోధనకు ఏర్పాట్లు
logo
Published : 14/06/2021 04:14 IST

ఆన్‌లైన్‌లో విద్యా బోధనకు ఏర్పాట్లు

పెడన గ్రామీణం, న్యూస్‌టుడే: ఒకటి నుంచి పదో తరగతి వరకు దూరదర్శన్‌ ద్వారా ఆన్‌లైన్‌ బోధనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు దూరదర్శన్‌ స్లాట్ల కోసం ఎస్‌సీఈఆర్టీ ప్రయత్నిస్తోంది. వాకు కేటాయించిన దాని ప్రకారం సమయసారణిని విడుదల చేయనున్నారు. ఈనెల 15 లేదా 16 నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన ప్రారంభించనున్నట్లు ఎస్‌సీఈఆర్టీ ప్రతినిధి పద్మజ తెలిపారు. ఇప్పటికే విద్యార్థులకు టీవీ, స్మార్టు ఫోన్‌, ట్యాబ్‌, కంప్యూటర్‌, నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్నాయా అనే వివరాలను ప్రధానోపాధ్యాయులు సేకరించి ఎస్‌ఎస్‌ ద్వారా రాష్ట్ర ఎస్పీడీ కార్యాలయానికి పంపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని