నిర్వాసితులకు స్థలాల కేటాయింపు
logo
Published : 18/06/2021 02:38 IST

నిర్వాసితులకు స్థలాల కేటాయింపు

ఇళ్ల స్థలాలు కేటాయించడానికి లాటరీ నిర్వహిస్తున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

మంగళగిరి, న్యూస్‌టుడే: తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయం సమీపంలోని కృష్ణాపశ్చిమ కాలువ గట్టుపై ఆక్రమణల తొలగింపులో భాగంగా నిర్వాసితులవుతున్న పేదలందరికీ లాటరీ పద్ధతిలో గురువారం స్థలాలు కేటాయించారు. నగరపాలకసంస్థ మంగళగిరి కార్యాలయం కౌన్సిల్‌ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పేదలందరికీ స్థలాలు ఇచ్చామని తెలిపారు. తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద నీటిపారుదల శాఖ స్థలంలో కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న పేదలకు పునరావాసం కల్పించాలన్న సీఎం ఆదేశాలను అమలు చేశామని అన్నారు. సీఎం క్యాంప్‌ కార్యాలయానికి సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయని గుర్తించిన నేపథ్యంలో ఆ ప్రాంతంలోని వారిని ఖాళీ చేయించి, సుమారు 283 మందికి సరిపోయేలా ఆత్మకూరు వద్ద భూమి సేకరించి, లేఅవుట్‌ చేయించి స్థలాలు ఇచ్చామని అన్నారు. ఒక్కొక్కరికి రెండు సెంట్లు వంతున కేటాయించామని అన్నారు. పేదలకు వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీ పథకం కింద రూ.1.80లక్షలతో ఇళ్లు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆళ్ల మాట్లాడుతూ.. ఆక్రమిత స్థలంలోని వారిని ఖాళీ చేయించే సమయంలో ఎవరూ ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి చెప్పారని, అందుకే ఇళ్లు కోల్పోవటం వల్ల కలిగే నష్టాన్ని కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు. కమిషనర్‌ పి.నిరంజన్‌రెడ్డి, అదనపు కమిషనర్‌ కె.హేమమాలిని, తహసీల్దార్‌ జీవీ రామ్‌ప్రసాద్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని