ఊపందుకున్న మిర్చి క్రయవిక్రయాలు
logo
Published : 23/06/2021 06:12 IST

ఊపందుకున్న మిర్చి క్రయవిక్రయాలు

మిర్చియార్డు, న్యూస్‌టుడే: గుంటూరు మిర్చియార్డులో క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. సెలవుల అనంతరం మిర్చియార్డు పునఃప్రారంభమయ్యాక మంగళవారం అత్యధికంగా మిర్చి బస్తాలు యార్డుకు వచ్చాయి. సోమవారం 43 వేలకు పైగా బస్తాలు యార్డుకు రాగా, మంగళవారం 54,171 బస్తాలు రైతులు తరలించారు. గత నిల్వలతో కలిపి 55,409 బస్తాలు అమ్మకాలు జరిగాయి. లావాదేవీలు ముగిసే సమయానికి యార్డులో 8,814 బస్తాలు నిల్వ ఉన్నాయి. నాన్‌ ఏసీ కామన్‌ వెరైటీ 334, నెంబర్‌ 5, 273, 341, 4884, సూపర్‌ 10 రకాల మిర్చి సగటు ధర రూ.7000 నుంచి రూ.15,000 ఉండగా.. తేజ రూ.7,000 నుంచి రూ.15,600, బాడిగ రూ.8,000 నుంచి రూ.17,000, తాలు మిర్చికి రూ.4,000 నుంచి రూ.8,500 ధర లభించింది. ఏసీ కామన్‌ వెరైటీ 334, నెంబర్‌ 5, 273, 341, 4884 రకాల సగటు ధర రూ.7,000 నుంచి రూ.16,500 ఉండగా, తేజ రూ.7,000 నుంచి రూ.15,700, బాడిగ రూ.11,000 నుంచి రూ.17,300, తాలు మిర్చికి రూ.4,200 నుంచి రూ.8,700 ధర లభించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని