స్వయం ఉపాధికి పాడి పరిశ్రమ సరైన మార్గం
eenadu telugu news
Published : 26/07/2021 04:13 IST

స్వయం ఉపాధికి పాడి పరిశ్రమ సరైన మార్గం

విజయ డెయిరీ ఛైర్మన్‌ చలసాని

మాట్లాడుతున్న ఛైర్మన్‌ ఆంజనేయులు

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: దేశంలోనే అత్యధికంగా పాల సేకరణ ధర లీటరుకు రూ.85 చొప్పున ఇస్తున్న ఘనత విజయ డెయిరీదేనని సంస్థ ఛైర్మన్‌ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. పాల ఉత్పత్తిదార్ల సంక్షేమమే లక్ష్యంగా పూర్తి అండదండలు అందజేస్తున్నామన్నారు. 2021-22 సంవత్సరానికి సంబంధించి మొదటి విడత బోనస్‌గా రూ.16 కోట్లు రైతులకు చెల్లించన్నుట్లు ఆయన చెప్పారు. హనుమాన్‌జంక్షన్‌ కాకాని భవనంలో ఆదివారం విలేఖర్ల సమావేశం నిర్వహించారు. లీటరు ధర త్వరలోనే రూ.100కు చేర్చాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తాను ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించే నాటికి రూ.650 కోట్లు టర్నోవర్‌ ఉండగా, రెండేళ్లలో దానిని రూ.915 కోట్లకు పెంచగలిగానన్నారు. పాల సేకరణ కూడా ఏడాదికి ఆరు కోట్ల నుంచి ఎనిమిది కోట్ల లీటర్లకు తీసుకెళ్లామన్నారు. క్షీరబంధు, కల్యాణమస్తు వంటి పథకాల ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్న లక్షా యాభైవేల పాడి రైతుల కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నామన్నారు. మేనేజర్‌ వీవీ సంపత్‌కుమార్‌, డైరెక్టరు లక్ష్మీప్రసాద్‌, పాల సంఘాల అధ్యక్షులు మొవ్వా శ్రీనివాసరావు, లింగం శ్రీధర్‌, కొల్లి రంగారావు, పట్టాభి, సుబ్బారావు, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని