విద్యుత్తు ఎస్‌ఈ కార్యాలయంలో అగ్నిప్రమాదం
eenadu telugu news
Published : 29/07/2021 05:19 IST

విద్యుత్తు ఎస్‌ఈ కార్యాలయంలో అగ్నిప్రమాదం


ఎగసిపడుతున్న మంటలు

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : స్వరాజ్య మైదానం సమీపంలోని విద్యుత్తు ఎస్‌ఈ కార్యాలయంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్నిప్రమాదం సంభవించింది. కమ్యూనికేషన్‌ గదిలో మంటలు ఏర్పడ్డాయి. నెమ్మదిగా అవి గది మొత్తం వ్యాపించటంతో కేబుళ్లు, కంప్యూటర్లు ఇతర పరికరాలు కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంపై విద్యుత్తు అధికారులు అంతర్గత దర్యాప్తు ప్రారంభించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని