మోహినీపురంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
eenadu telugu news
Published : 31/07/2021 06:01 IST

మోహినీపురంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

మోపిదేవి, న్యూస్‌టుడే : మోహనీపురంలో నాలుగు రోజుల పాటు నిర్వహించే వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పవిత్రోత్సవాలు గోపూజతో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆలయ సహాయ కమిషనర్‌ జీవీడీఎన్‌ లీలాకుమార్‌, వేదపండితులు, అర్చకులు, చల్లపల్లి ఎస్టేట్‌ దేవాలయాల అధికారులు, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు. రుత్విగ్వరణ, అఖండ స్థాపన, వాస్తు మండపారాధన, సుబ్రహ్మణ్య మూలమంత్ర అనుష్ఠానాలు, వాస్తు హోమం, అంకురారోపణ, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని