‘దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి’
eenadu telugu news
Published : 01/08/2021 02:43 IST

‘దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి’

గుంటూరు నేరవార్తలు: మహిళల రక్షణ, వారి భద్రతకు ఎంతో ఉపయోగకరమైన దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ సూచించారు. ఎస్పీ తన కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. గుంటూరు నగరంలో ఇప్పటి వరకు 80 వేల మంది దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. కొండపల్లి మైనింగ్‌ సందర్శనకు వెళ్తున్న నేతల అరెస్టు విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ చాలా సున్నితమైన అంశం కావడంతో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ముందుస్తు చర్యలు తీసుకున్నామన్నారు. గుంటూరు నగరంలోని ఓ ప్రార్థనా మందిరం విషయంలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్పందిస్తూ అది కూడా సున్నితమైన అంశమని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని