విత్తనోత్పత్తిలో సన్న, చిన్నకారు రైతులకు భాగస్వామ్యం
eenadu telugu news
Published : 04/08/2021 01:13 IST

విత్తనోత్పత్తిలో సన్న, చిన్నకారు రైతులకు భాగస్వామ్యం

ప్రమాణ స్వీకారం చేస్తున్న పెర్నాటి హేమ సుష్మిత, చిత్రంలో సంస్థ ఎండీ శేఖర్‌బాబు, సజ్జల రామకృష్ణారెడ్డి, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి తదితరులు

రామవరప్పాడు, న్యూస్‌టుడే:  విత్తనోత్పత్తిలో సన్న, చిన్నకారు రైతులను భాగస్వాములను చేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్‌పర్సన్‌ పెర్నాటి హేమ సుష్మిత అన్నారు. విజయవాడ గ్రామీణ మండలం ప్రసాదంపాడు విత్తనాభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయంలో మంగళవారం  ఆమెతో విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టరు జి.శేఖర్‌బాబు ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు  సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలు నాటడం ద్వారా రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు అవసరమైన విత్తనాలను ముందుగానే సిద్ధం చేసుకుని సకాలంలో వారికి పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. శాసన మండలి సభ్యుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్‌రెడ్డి(సర్వేపల్లి), మెరుగు నాగార్జున (వేమూరు), ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్‌, పేర్నేటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, విత్తనాభివÅృద్ధి సంస్థ మేనేజర్‌ సుబ్బారావు, మాజీ డైరెక్టరు సలాది మురళీకృష్ణ తదితరుల పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని