రేషన్‌ బియ్యంతో భోజనం బాగుందమ్మా..!
eenadu telugu news
Updated : 18/09/2021 11:34 IST

రేషన్‌ బియ్యంతో భోజనం బాగుందమ్మా..!


నల్లకుంట ఏరియాలో ఓ పేదింట్లో రేషన్‌ బియ్యం ఆహారాన్ని తిని పరిశీలించిన జేసీ దినేష్‌కుమార్‌, పక్కన కార్పొరేటర్‌ రోషన్‌

ఏటి అగ్రహారం, న్యూస్‌టుడే: కాలువ గట్టున ఇల్లు.. ఇంటి పైకప్పునకు తాటాకులు వేసే స్థోమత కూడా లేదేమో పరదాలు చుట్టి ఉంది. శుక్రవారం మధ్యాహ్నం కాసిన్ని బియ్యం గింజలు ఎసట్లో పోసి మిరపకాయలు తోడేలు ఒలిచే పనిలో ఉన్నారు. ఇంతలో పది మందికి పైగా అధికారులు ఆ వీధిలోకి వచ్చారు. వారిలో ఒకరు నమస్కారమమ్మా.. బాగున్నారా.. నా పేరు దినేష్‌కుమార్‌.. జాయింట్‌ కలెక్టర్‌ని అంటూ చిరునవ్వుతో పలకరించారు. అమ్మా.. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అని ఆరా తీశారు. ఇంతలో చుట్టుపక్కల ప్రజలు అక్కడకు చేరుకోగా వారినీ పలకిరంచారు. రేషన్‌ బియ్యం నాణ్యత గురించి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం బీపీటీ, సోనామసూరి రకాలను ప్రభుత్వం రూ.39కు కొనుగోలు చేసి ప్రజలకు రూపాయికి ఇస్తుందని తెలిపారు. అనంతరం ఇక్కడ ఎవరి ఇంట్లోనైనా ఈ రోజు రేషన్‌ బియ్యం వండారా అని ప్రశ్నించారు. ఆ ప్రాంతవాసులంతా తాము రేషన్‌ బియ్యమే తింటున్నామని చెప్పారు. అక్కడే ఉన్న ఆళ్ల నాగేంద్రమ్మను కాస్త అన్నం వడ్డిస్తారా? అని జేసీ అడిగారు. అంతటి అధికారి తమ ఇంటికి వచ్చి భోజనం చేస్తామనడంతో వెంటనే ఆనందంతో రేషన్‌ బియ్యంతో వండిన అన్నం జేసీ, వెంట వచ్చిన డివిజన్‌ కార్పొరేటర్‌ రోషన్‌, అధికారులకూ వడ్డించారామె. ఆహారం తీసుకున్న జేసీ చాలా బాగుందమ్మా.. అని చెప్ఫి. అభినందించి వెనుదిరిగారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని