కాంపౌండ్‌ రౌండ్‌లో కృష్ణా పురుషుల జట్టు సత్తా
eenadu telugu news
Published : 19/09/2021 02:06 IST

కాంపౌండ్‌ రౌండ్‌లో కృష్ణా పురుషుల జట్టు సత్తా


జాతీయ కాంపౌండ్‌ రౌండ్‌కు ఎంపికైన రాష్ట్ర ఆర్చర్లతో ఎంపిక కమిటీ సభ్యులు, నిర్వాహకులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: కాంపౌండ్‌ రౌండ్‌లో జిల్లా పురుషుల జట్టు సత్తా చాటి రాష్ట్ర జట్టులో తొలి మూడు స్థానాల్లో నిలిచి 40వ జాతీయ సీనియర్‌ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు. గుణదల విజయలక్ష్మికాలనీలోని వీఎంసీ ఓల్గా ఆర్చరీ మైదానంలో జరుగుతున్న 40వ రాష్ట్ర స్థాయి అంతర్‌ జిల్లాల సీనియర్‌ (స్త్రీ, పురుషుల) విలువిద్య ఛాంపియన్‌షిప్‌లో శనివారం కాంపౌండ్‌ రౌండ్‌ పురుషుల విభాగంలో కృష్ణా జిల్లా ఆర్చర్లు తమ హవా కొనసాగించగా.. మహిళల విభాగంలో పశ్చిమ గోదావరి ఆర్చర్లు మెరుగైన ప్రతిభను ప్రదర్శించి తొలి నాలుగు స్థానాలను కైవసం చేసుకొని క్లీన్‌ స్వీప్‌ చేశారు. డబుల్‌ ఫిఫ్టీ (50మీ. + 50మీ.)లో మొత్తం ఆర్చర్లు సాధించిన స్కోర్‌ ఆధారంగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన స్త్రీ, పురుషులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర విలువిద్య సంఘం ప్రధాన కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ ర్యాంకింగ్‌లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ఆర్చర్లు వచ్చే నెల ఒకటి నుంచి 10వ తేదీ వరకు ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో జరిగే 40వ జాతీయ సీనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో తలపడతారన్నారు.

పురుషుల జట్టు: కుందేరు వెంకటాద్రి, పెండ్యాల త్రినాథ్‌చౌదరి, మైనేని సాయి చరిత్‌ (కృష్ణా), తిరుమూరు గణేష్‌ మనిరత్నం (విశాఖపట్నం), స్టాండ్‌ బైగా మనోజ్‌కుమార్‌ (కృష్ణా).

మహిళల జట్టు: మాదల సూర్య హంసిని, కెంగం శరణ్య, కర్రి సుష్మిత, అల్లూరి కనిష్క (పశ్చిమ గోదావరి), స్టాండ్‌ బైగా బి.తేజశ్రీ (నెల్లూరు).


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని