జిల్లా రగ్బీ సంఘం నూతన కార్యవర్గం
eenadu telugu news
Published : 21/09/2021 03:17 IST

జిల్లా రగ్బీ సంఘం నూతన కార్యవర్గం

ఎన్నికైన కమిటీ సభ్యులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: జిల్లా రగ్బీ సంఘం నూతన కార్యవర్గం సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికైందని ఎన్నికల అధికారి పిళ్లా శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం వన్‌టౌన్‌లోని కొరగంజి కల్యాణ మండపంలో జరిగిన సంఘ సర్వసభ్య సమావేశానంతరం ఈ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా కొరగంజి జగన్నాథరావు, ఉపాధ్యక్షులుగా ఎస్‌.వెంకటేశ్వర్లు, మురళీ, ప్రధాన కార్యదర్శిగా ఎస్‌.చంద్రకళ, సంయుక్త కార్యదర్శులుగా రంజిత్‌ కుమార్‌, శివచైతన్య, కోశాధికారిగా టి.తులసీరావు, ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా మౌనిక, హారిక ఎన్నికయ్యారని పేర్కొన్నారు. రాష్ట్ర రగ్బీ సంఘం ప్రధాన కార్యదర్శి బి.రామాంజనేయులు, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ చీఫ్‌ కోచ్‌ బి.శ్రీనివాసరావు ఎన్నికల పరిశీలకులుగా హాజరయ్యారు. సర్వసభ్య సమావేశానికి జిల్లా రగ్బీ సంఘం మాజీ అధ్యక్షుడు కొప్పుల సుగుణరావు అధ్యక్షత వహించగా.. మాజీ ప్రధాన కార్యదర్శి టి.కృష్ణచైతన్య, సభ్యులు ఎంవీఎస్‌ ప్రసాద్‌, టి.సంగయ్య, వై.మురళీ, టి.శ్రీలత, జి.రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని