రైల్వే పనులు ముందుకు సాగేందుకు చర్యలు
eenadu telugu news
Published : 22/09/2021 03:51 IST

రైల్వే పనులు ముందుకు సాగేందుకు చర్యలు

కృష్ణలంక, న్యూస్‌టుడే: జిల్లాలో రైల్వే ప్రాజెక్టు పనులు ముందుకు సాగేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ జె.నివాస్‌ అన్నారు. దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ రైల్వే, రెవెన్యూ ఉన్నతాధికారులతో మంగళవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గన్నవరం మండలం వెదురుపావులూరు దగ్గర రైల్వే ఓవర్‌ బ్రిడ్జి, విజయవాడ, కాజీపేట మధ్య రైల్వే లైన్‌ విస్తరణకు సంబంధించి గొల్లపూడి వద్ద భూసేకరణ, అలైన్మెంట్‌ మార్పు తదితర అంశాలపై సమీక్షించారు. సమావేశంలో జేసీ మాధవీలత, విజయవాడ సబ్‌ కలెక్టర్‌ జీఎస్‌ఎస్‌ ప్రవీణ్‌ చంద్‌, నూజివీడు ఆర్టీవో కె.రాజ్యలక్ష్మి, రైల్వే ఇంజినీర్‌ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని