జిల్లాలో 764 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
eenadu telugu news
Published : 24/09/2021 03:35 IST

జిల్లాలో 764 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

కృష్ణలంక, న్యూస్‌టుడే: ఖరీఫ్‌లో ధాన్యం సేకరణకు జిల్లాలో 764 రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని జేసీ (రెవెన్యూ) కె.మాధవీలత అన్నారు. క్యాంపు కార్యాలయంలో గురువారం వ్యవసాయ మార్కెటింగ్‌, పౌరసరఫరాల అధికారులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 2,49,286 హెక్టార్లలో ఖరీఫ్‌ సాగయిందని, మొత్తం 17,11,535 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 11 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు లక్ష్యంగా నిర్దేశించామని వెల్లడించారు. జిల్లాలో 814 రైతు భరోసా కేంద్రాలు ఉండగా, 50 కేంద్రాలు ఆక్వా కల్చర్‌ కింద ఉన్నాయని, మిగిలిన 764 చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 2021-22 ఖరీఫ్‌ పంటకు సంబంధించి గ్రేడ్‌ ఏ రకం ధాన్యం క్వింటాకు రూ.1960, సాధారణ రకానికి రూ.1940గా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని జేసీ వివరించారు. సమావేశంలో వ్యవసాయశాఖ జేడీ టి.మోహన్‌రావు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ కె.రాజ్యలక్ష్మి, మార్కెటింగ్‌ శాఖ ఉప సంచాలకులు దివాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని