పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
eenadu telugu news
Published : 17/10/2021 03:06 IST

పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

పండగ వేళ కుటుంబానికి తీరని శోకం

యశ్వంత్‌ మృతదేహం

తెనాలి టౌన్‌: ఒక్కగానొక్క కుమారుడు.. అప్పటివరకు అందరితో కలిసి ఉన్న వాడు.. ఒక్కసారిగా ప్రాణాలు తీసుకోవడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతు లేకుండా పోయింది. వన్‌టౌన్‌ ఎస్సై అనిల్‌కుమార్‌ తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని చినరావూరు ప్రాంతానికి చెందిన యశ్వంత్‌ (16) పదో తరగతి చదువుతున్నాడు. తండ్రి చినరావూరు మహాప్రస్థానంలో పనిచేస్తారు. తల్లి అదే ప్రాంతంలో అల్పాహార బండి నిర్వహిస్తారు. ఈ దంపతులకు యశ్వంత్‌ ఒక్కడే కుమారుడు. ఇతను కొంతకాలంగా ముభావంగా, ఒంటరిగా ఉంటున్నారు. శుక్రవారం దసరా కావడంతో డొంక రోడ్డులోని చిన్నాన్న ఇంటికి తల్లిదండ్రులతో కలిసివెళ్లిన ఈ యువకుడు సాయంత్రం 4 గంటల సమయంలో తాను ఇంటికి వెళతానని చెప్పి వచ్చేశారు. రెండు గంటల అనంతరం తండ్రి ఇంటికి రాగా, ఇంట్లో యశ్వంత్‌ ఉరి వేసుకుని కనిపించారు. పోలీసులు మృతదేహాన్ని వైద్యశాలకు తరలించారు. ఇతను కొంతకాలంగా ఆన్‌లైన్‌లో ఆటలు ఆడుతున్నాడని, వాటికే ఎక్కువ సమయం కేటాయించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని