‘సోనోవిజన్‌ లక్కీ డ్రా’ విజేత జ్యోతికుమారి
eenadu telugu news
Published : 17/10/2021 03:06 IST

‘సోనోవిజన్‌ లక్కీ డ్రా’ విజేత జ్యోతికుమారి

విజేతను ప్రకటిస్తున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు, షోరూమ్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ భాస్కరమూర్తి

సీతారాంపురం (విజయవాడ), న్యూస్‌టుడే : దసరా డిస్కౌంట్‌ సేల్‌ సందర్భంగా శనివారం ఏలూరు రోడ్డు సోనోవిజన్‌ షోరూమ్‌లో నిర్వహించిన లక్కీ డ్రాలో నగరానికి చెందిన ఇందుపల్లి జ్యోతికుమారి (న్యూ గిరిపురం) ‘హోండా ఇమేజ్‌’ కారు గెలుచుకున్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్యఅతిథిగా హాజరై.. కొనుగోలుదారుల సమక్షంలో లక్కీ డ్రా తీసి, విజేతలను ప్రకటించారు. ఎస్‌.దుర్గారావు (విజయదుర్గానగర్‌) ఎల్‌ఈడీ టీవీ, నాగూర్‌ మొహమ్మద్‌ (విజయవాడ) రిఫ్రిజిరేటర్‌, ఎం.సరిత (గవర్నరుపేట) వాషింగ్‌ మెషీన్‌ను గెలుచుకున్నారు. విష్ణు మాట్లాడుతూ.. అందరికన్నా తక్కువ ధరలు, నమ్మకమైన సర్వీస్‌తో అందించే అతిపెద్ద ఎలక్ట్రానిక్‌ షోరూమ్‌ సోనోవిజన్‌ అని అన్నారు. దసరా సందర్భంగా ఈ సంస్థ అందించే డిస్కౌంట్‌ సేల్‌ను ప్రజలు అనూహ్యంగా ఆదరిస్తున్నారన్నారు. సోనోవిజన్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ పి.భాస్కరమూర్తి మాట్లాడుతూ.. మంచి ఉత్పత్తులను తక్కువ ధరల్లో అందిస్తున్నామని చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని