ముగిసిన జిల్లా స్థాయి ఎంపికలు
eenadu telugu news
Published : 18/10/2021 04:38 IST

ముగిసిన జిల్లా స్థాయి ఎంపికలు


షటిల్‌ పరుగులో విద్యార్థులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: కడపలోని రాష్ట్ర క్రీడా పాఠశాలలో 4, 5 తరగతుల్లో ప్రవేశానికి జిల్లా స్థాయి ఎంపికలు ఆదివారంతో ముగిశాయి. మొత్తం 60 మంది చిన్నారులు హాజరయ్యారని డీఎస్‌ఏ ముఖ్యకార్యనిర్వహణాధికారి యు.శ్రీనివాసరావు తెలిపారు. శక్తి, వేగం, బలం, శరీర కదలికలు, ఎత్తు, బరువులను పరీక్షించి వారి సామర్థ్యాలకు అనుగుణంగా పాయింట్లు కేటాయించామని, ఒక బాలిక, ఎనిమిది మంది బాలురు రాష్ట్ర స్థాయి ఎంపికలకు అర్హత సాధించారని డీఎస్‌ఏ సీఈవో యు.శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నెల 27, 28 తేదీల్లో గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఎంపికల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని