270 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం
eenadu telugu news
Published : 20/10/2021 04:45 IST

270 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం

భవానీపురం, న్యూస్‌టుడే : భవానీపురం దర్గా స్థలాల్లో నిల్వ ఉంచి 270 బస్తాల రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలు గ్రామానికి చెందిన బోయనపల్లి సురేష్‌ రేషన్‌ బియ్యాన్ని దర్గా స్థలాల్లోని ఒక నివాసంలో నిల్వ ఉంచాడు. సమాచారం అందుకున్న విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకుని పౌరసరఫరాల శాఖ అధికారులకు సోమవారం అప్పగించారు. పౌరసరఫరాల శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని