విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
eenadu telugu news
Published : 20/10/2021 04:45 IST

విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు

ప్రసంగిస్తున్న డీఎంహెచ్‌వో సుహాసిని

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: గర్భిణులు, బాలింతలకు అందించే సేవల్లో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డా.ఎం.సుహాసిని సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం మచిలీపట్నంలోని జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో మచిలీపట్నం, గుడివాడ డివిజన్ల వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాఖాపరంగా అందించే సేవలు సక్రమంగా అందించాలని అన్నారు. నిర్దేశించిన సమయాల్లో పరీక్షలు చేయడం, అవసరమైన చికిత్స అందించడంతోపాటు ఆయా వివరాలను ఎప్పటికప్పుడు మాతాశిశుసంరక్షణ వెబ్‌సైట్లో నమోదు చేయాలని సూచించారు. విధి నిర్వహణలో ఏ ఒక్కరు అశ్రద్ధ వహించినా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే కొంతమందికి మెమోలు జారీచేశామని మిగిలినవారు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. అదనపు డీఎంహెచ్‌వో డా.శర్మిష్ట, అధికారులు డా.వంశీకృష్ణ, సుదర్శన్‌బాబు, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని